
మధ్య తరగతి కుటుంబ కథ ‘‘ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరించాలి. ముఖ్యంగా ‘ఇంటింటి రామాయణం’ లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు డైరెక్టర్ మారుతి. వీకే నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రల్లో సురేష్ నరెడ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. ఎస్. నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఇంటింటి రామాయణం’ని ముందు ఓటీటీ కోసమే ప్రారంభించాం. అవుట్‌పుట్ చూశాక థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన చిత్రం ఇది’’ అన్నారు సురేష్ నరెడ్ల. ‘‘మాకు మద్దతుగా నిలిచిన నాగవంశీ, మారుతిలకు థ్యాంక్స్’’ అన్నారు వెంకట్, గోపీచంద్.