ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘బచ్చన్ పాండే’ సినిమా తారాగణంలో చేరనున్నారు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాణంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బచ్చన్ పాండే’. తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకు ఇది హిందీ రీమేక్. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ అక్షయ్ కుమార్‌కు జోడిగా నటించన్నారు. తాజాగా జాక్వెలిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో ఫొస్ట్ చేశారు. ‘‘బచ్చన్ పాండే’యాక‌్షన్-కామెడీ చిత్రంలోని నటీనటులతో కలిసి నటించడానికి చాలా ఆత్రుతగా ఉన్నాను’ అని కామెంట్ జత చేశారు.
తనకు చాలా సంతోషం కలిగించే షూటింగ్ వాతావరణం సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాణ సంస్థలోని సినిమాల్లో దొరుకుతుందని తెలిపారు. తనకు సాజిద్ నిర్మాణ సంస్థలో ఇది 8వ చిత్రమని పేర్కొన్నారు. ఎప్పుడెప్పడు అక్షయ్‌తో షూటింగ్‌లో పాల్గొనాలని ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఇక అక్షయ్ కుమార్ సరసన జాక్వెలిన్ హౌస్ ఫుల్ సీరిస్‌లోని ఓ మూవీలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ‘బ్రదర్స్’ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో జైసల్మేర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఎలాంటి పాత్రలో మెరుస్తారో చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ఇటీవల నటుడు అర్షద్ వార్సీ కూడా ‘బచ్చన పాండే’లో అక్షయ్ కుమార్‌కి స్నేహితుడి పాత్రలో నటిస్తారని మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌గా, కృతి సనన్ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment