తెలుగులో మరో సినిమా | Janhvi Kapoor To Join Ram Charan In Buchi Babu Sana In His Upcoming Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Charan RC16 Update: తెలుగులో మరో సినిమా

Published Tue, Feb 20 2024 12:34 AM | Last Updated on Tue, Feb 20 2024 10:38 AM

Janhvi Kapoor to join Ram Charan in Buchi Babu Sana next Telugu Project - Sakshi

జాన్వీ కపూర్‌ తెలుగులో మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నారు. హీరో రామ్‌ చరణ్‌కి ఆమె జోడీగా నటించనున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా (‘ఆర్‌సీ 16’ వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా ఎవరు నటిస్తారు? అంటూ తెరపైకి వచ్చిన హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్‌ పేరు కూడా ఉంది.

అయితే ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, జాన్వీ కపూర్‌ తండ్రి, నిర్మాత బోనీకపూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘రామ్‌ చరణ్‌తో జాన్వీ కపూర్‌ చేసే చిత్రం త్వరలో ఆరంభం కానుంది’’ అని స్పష్టం చేశారు. దీంతో రామ్‌చరణ్‌కి జోడీగా నటించే హీరోయిన్‌ ఎవరనే ప్రశ్నకు జవాబు దొరికింది. ఇక గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందనున్న ‘ఆర్‌సీ 16’ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement