విజయ్‌ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై జాన్వీ షాకింగ్‌ కామెంట్స్‌, ఏమన్నదంటే.. | Janhvi Kapoor Spill The Beans on Vijay Devarakonda Relationship Status | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor-Vijay Devarakonda: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Thu, Oct 27 2022 3:30 PM | Last Updated on Thu, Oct 27 2022 3:34 PM

Janhvi Kapoor Spill The Beans on Vijay Devarakonda Relationship Status - Sakshi

విజయ్‌ దేవరకొండపై బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక-విజయ్‌లు ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి రిలేషన్‌పై జాన్వీ పరోక్షంగా కామెంట్స్‌ చేసింది. ఆమె తాజా చిత్రం మిలీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా మూవీ విశేషాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో తన రిలేషిప్‌ స్టేటస్‌పై హోస్ట్‌ నుంచి ఆమెకు ప్రశ్న ఎదురైంది.

చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్‌ హీరోయిన్‌ వర్ష! నిర్మాత కొడుకుతో పెళ్లి?

దీనికి ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తాను సింగిల్‌ అని, ఎవరితోనూ ప్రేమలో లేనని చెప్పంది. అలాగే తన పేరు జాన్వీ కాకపోలే లైలా అని పిలిపించుకునేదాన్ని అని, కానీ తన జీవితంలో మజ్ను ఎవరూ లేరని పేర్కొంది. దక్షిణాది హీరోలలో ఎవరితో నటించాలని ఉంది అని అడగ్గా..  అందరితో నటించాలని ఉందని, అందులో ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఆ తర్వాత యాంకర్‌ ఒకవేళ మీకు స్వయంవరం పెడితే ఇండస్ట్రీ నుంచి ఏ ఇద్దరు హీరోలు పాల్గొనాలని అడగ్గా.. రణ్‌బీర్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌ అని సమాధానం ఇచ్చింది.

చదవండి: అనసూయ పక్కన ఉన్న ఈ కొత్త వ్యక్తి ఎవరు? అతడితో అంత క్లోజ్‌ ఏంటి..

అయితే రణ్‌బీర్‌ పెళ్లయిపోయింది కాబట్టి పెళ్లి కానీ సింగిల్‌ స్టేటస్‌ హీరోల పేర్లు చెప్పాలని యాంకర్‌ పేర్కొంటూ విజయ్‌ దేవరకొండ పేరు సూచించారు. ఇక దీనికి జాన్వీ స్పందిస్తూ.. ఆయనకు ప్రాక్టికల్‌గా ఇప్పటికే పెళ్లి అయిపోయిందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. దీంతో ‘రష్మిక-విజయ్‌లు సీరియస్‌ రిలేషన్‌లో ఉన్నారని జాన్వీ చెప్పకనే చెప్పిందా!’, ‘తను చెప్పింది రష్మికతో రిలేషన్‌లో గురించేనా?’ అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement