ముంబై: నటుడు అలీ గోని తనకు స్నేహితుడు మాత్రమే అని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని ‘నాగిన్’ సీరియల్ ఫేం జాస్మిన్ భాసిన్ అన్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, ఒకరి గర్ల్‌ఫ్రెండ్‌గానో.. మరొకరి ప్రేయసిగానో పేర్కొంటూ తన గురించి వదంతులు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. కాగా రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీలో జాస్మిన్, అలీ జంటగా పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ రూమర్లు వ్యాపించాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ వీరిద్దరు ఫొటోలు షేర్ చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. అలీని సోల్‌మేట్ అని జాస్మిన్ సంబోధించడం, జాస్మిన్ లేకుంటే తాను ఏమయ్యేవాడినో అంటూ అలీ పోస్టులు పెట్టడంతో వీరిని లవ్‌బర్డ్స్‌గా పేర్కొంటూ గాసిప్‌రాయుళ్లు ఇష్టం వచ్చినట్లుగా కథనాలు అల్లేశారు.(నా పిల్లలను చూశాకే మార్పు మొదలయ్యింది)
ఈ వార్తలపై స్పందించిన జాస్మిన్.. ఇలాంటి అసత్య కథనాలు మొదట్లో నవ్వుకోవడానికి బాగానే ఉండేవని, అయితే ఇప్పుడు అవి మరింతగా శ్రుతిమించడంతో తమ మధ్య స్నేహ బంధం బీటలు వారే అవకాశం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఆడ, మగ మధ్య స్నేహాన్ని ప్రేమతో ముడిపెట్టడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు.‘‘మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. కానీ గత రెండేళ్లుగా మా గురించి విపరీతమైన రూమర్లు ప్రచారమవుతున్నాయి. అవి నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నాయి. ఒక మహిళగా ఎన్నో కష్టాలకోర్చి నేను ఈరోజు నటిగా గుర్తింపు దక్కించుకున్నాను. (ట్రెండ్ అవుతోన్న సమంత న్యూ ఇయర్ రింగ్స్)
కానీ ఎప్పుడూ వేరొకరి పేరుతో నన్ను ముడిపెట్టి చూపించడం అస్పలు బాగాలేదు. మహిళలను కాస్త గౌరవించడం నేర్చుకోండి’’ అని జాస్మిన్ విజ్ఞప్తి చేశారు. నిజం చెప్పాలంటే జీవిత భాగస్వామిలో తను కోరుకునే లక్షణాలు ఒక్కటి కూడా తన స్నేహితుడిలో లేవంటూ చమత్కరించారు. కాగా తషన్-ఏ-ఇష్క్, దిల్ సే దిల్ తక్, కరోడ్ పతి అండ్ వేట అనే హిందీ షోలతో పాటు రెండు దక్షిణాది సినిమాల్లోనూ ఆమె నటించారు. ఇక అలీ యే మొహబ్బతే, బహూ హమారీ రజనీకాంత్ వంటి సీరియళ్లలో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment