
చెన్నై: కోలీవుడ్ నటుడు జయం రవి. ఈయన నటించిన భూమి చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కల్యాణ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పుడు మరో చిత్రానికి జయం రవిపచ్చ జెండా ఉపారన్నది తాజా సమాచారం.
ఇది జయంరవి 29వ చిత్రం. ఈ చిత్రం ద్వారా ఆంథోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. దర్శకుడు మిత్రన్ మంచి స్నేహితుడు. జయం రవి కథానాయకుడిగా ‘భూమి’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన హోమ్ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఇందులో లభించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతికవర్గం ఎంపీక జరుగుతోందని తెలిసింది.
చదవండి: బీ-టౌన్‌లో కరోనా కష్టాలు.. టెన్షన్‌లో స్టార్ హీరోలు
Comments
Please login to add a commentAdd a comment