సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. టీడీపీ,బీజేపీ,జనసేన కూటమిలో భాగమైన చంద్రబాబు,లోకేష్, పవన్ కల్యాణ్, పురంధేశ్వరికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
'ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన శ్రీభరత్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.' అని ఎన్టీఆర్ తెలిపారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…— Jr NTR (@tarak9999) June 5, 2024
Comments
Please login to add a commentAdd a comment