హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలెక్కడం ఖాయమైపోయింది. ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న పెళ్లాడనున్నట్టు కాజల్ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఉదయం ఆమె ట్వీట్ చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పింది. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని చందమామ బ్యూటీ ఆకాక్షించింది. కొంతకాలంగా గౌతమ్ కిచ్లు, అగర్వాల్ మధ్య నడిచిన స్నేహం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగినట్టు సమాచారం.
(చదవండి: ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ వచ్చేసింది)
టాలీవుడ్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కల్యాన్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో నటించి అగ్ర స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పించారు. కాగా కాజల్ చెల్లి ఇషా అగర్వాల్ ఏడేళ్ల కిత్రమే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
(చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతిలో తెలంగాణ టీచర్)
Comments
Please login to add a commentAdd a comment