
బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బెంగళూరులోని ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జూన్ 12న రాత్రి విజయ్ తన స్నేహితుడిని కలిసిన అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విజయ్ తల, కాలికి బలమైన గాయాలు తలిగాయి. అతడిని పరీక్షిస్తున్న న్యూరోసర్జన్ అరుణ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నాడు. అతడి మెదడులో రక్తం గడ్డ కట్టిందని, దీనికి సర్జరీ చేశామన్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు.
కాగా విజయ్ 'రంగప్ప హోంగ్బిట్నా' అనే సినిమాతో 2011లో వెండితెరపై కాలుమోపాడు. 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో స్టార్ హోదా పొందాడు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన 'నాను అవనల్ల.. అవలు' సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. తను చివరిసారిగా 'యాక్ట్ 1978' చిత్రంలో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment