కష్టాన్ని నమ్ముకున్నా, ఆ ఫీలింగ్‌ లేదు: యంగ్‌ హీరో | Kiran abbavaram talks about sr kalyana mandapam | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: కష్టాన్ని నమ్ముకున్నా, అప్పుడే హీరోగా చేశా!

Published Thu, Jul 15 2021 1:10 AM | Last Updated on Thu, Jul 15 2021 7:24 AM

Kiran abbavaram talks about sr kalyana mandapam - Sakshi

కిరణ్‌ అబ్బవరం

‘‘2016లో ఇండస్ట్రీకి వచ్చాక రెండేళ్ల పాటు 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకున్నాను. ఆ తర్వాతే హీరోగా చేశాను. బ్యాక్‌గ్రౌండ్‌ లేదనే ఫీలింగ్‌ లేదు. కష్టాన్ని నమ్ముకున్నాను’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం ఈ.ఎస్‌.టి.1975’. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదల కానుంది.

గురువారం తన బర్త్‌డే సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ – ‘‘రాజావారు రాణిగారు’తో హీరోగా పరిచయమయ్యాను. వెంటనే ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ సినిమా చేశాను. రాయలసీమ నేపథ్యంలో సాగే తండ్రి, కొడుకుల కథ ఇది. ‘ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఖుషీ, పోకిరి’ వంటి చిత్రాలు చూసేటప్పుడు ప్రేక్షకుల్లో ఓ వైబ్రేషన్‌ ఉండేది.. అలాంటి వైబ్‌ తీసుకురావాలనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నేనే రాశాను. నేను నటించిన ‘సెబాస్టియన్‌’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘సమ్మతమే’ సినిమా చేస్తున్నాను. కోడి రామకృష్ణగారి బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement