
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో స్టార్ట్ కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటానీ, అనన్య పాండే పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్ అయితేనే బాగుటుందని చిత్ర బృందం అభిప్రాయపడుతుందట.
చదవండి: రాత్రి 11 గంటలకు కానిస్టేబుల్ ఆపి దురుసుగా ప్రవర్తించారు: హీరోయిన్
దీంతో జాన్వీని ఈ సినిమాకు ఫైనల్ చేయాలనే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే కొరటాల బృందం జాన్వీని సంప్రదించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఆమె అటూ ఇటూగా ఉన్న జాన్వీని ఒప్పించేందుకు అన్ని విధాల ప్లాన్ చేస్తున్నారట కొరటాల బృందం. కాగా పెద్ద బ్యానర్ .. స్టార్ కాంబినేషన్ .. కథ నచ్చితే జాన్వీ తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉందని ఆ మధ్య ఆమె తండ్రి బోనీ కపూర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఒప్పించడానికి కొరటాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.