సిగరెట్‌ తాగిన హీరోయిన్‌? అబ్బే, మా అమ్మాయికి అలవాటు లేదు! | Kriti Sanon Caught Smoking in Viral Video from Greece Vacation | Sakshi
Sakshi News home page

సిగరెట్‌ తాగిన హీరోయిన్‌? పదిమందితో మాన్పించడమే తెలుసన్న తల్లి!

Published Wed, Jul 31 2024 12:53 PM | Last Updated on Wed, Jul 31 2024 3:47 PM

Kriti Sanon Caught Smoking in Viral Video from Greece Vacation

హీరోయిన్‌ కృతి సనన్‌ ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. సోదరి నుపూర్‌ సనన్‌తో పాటు ప్రియుడిగా భావిస్తున్న కబీర్‌ బహియా కూడా ఆమె వెంటే ఉన్నాడు. జూలై 27న తన 34వ పుట్టినరోజును గ్రీస్‌లో వీరిద్దరి సమక్షంలో హ్యాపీగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇకపోతే ఈ వెకేషన్‌లోనే.. సముద్ర తీరంలో కృతి సనన్‌ సిగరెట్‌ తాగిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కృతి చేతిలో సిగరెట్‌
అందులో ఆరెంజ్‌ డ్రెస్‌లో చేతిలో సిగరెట్‌ పట్టుకుని ఉన్నది కృతి సనన్‌ అని పలువురూ భావిస్తున్నారు. ఈ క్రమంలో కృతికి ధూమపానం నచ్చదంటూ ఆమె తల్లి గీతా సనన్‌ గతంలో చేసిన ట్వీట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బరేలీ కి బర్ఫీ సినిమాలో కృతి సిగరెట్‌ తాగుతుంది. ఆ మూవీలోని ఫోటోను ఆమె అభిమాని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ ఇది సినిమా కోసమేనని, అనవసరంగా కృతి గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.

నాకసలు నచ్చదు
దీనిపై గీత స్పందిస్తూ.. అవును, తను ధూమపానానికి వ్యతిరేకి. తన చుట్టూ ఉండేవాళ్లను సైతం తాగొద్దని హెచ్చరిస్తుంది అని రిప్లై ఇచ్చింది. కృతి కూడా ఓ ఇంటర్వ్యూలో.. నేను ఎప్పటికీ సిగరెట్‌ తాగను. ఇదే మాటపై నిలబడతాను. కేవలం సినిమాలో నటించేటప్పుడు మాత్రమే సిగరెట్‌ పట్టుకుంటాను. సిగరెట్‌ తాగకుండా నటిస్తే పొగరాయుళ్లు ఇట్టే గుర్తుపడతారు. అందుకనే మూవీలో నా పాత్ర డిమాండ్‌ చేస్తే సిగరెట్‌ తాగేందుకు వెనుకాడను అని చెప్పుకొచ్చింది.

 

చదవండి: రూ.3.5 కోట్ల అప్పు.. రోడ్డునపడ్డా! ఈ బతుకు వద్దనుకున్నా: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement