
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేయస్ రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై వీకే రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్ బ్లూస్’. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇచ్చే టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ఎలా ఉంటాయి? అనే కథాంశంతో రూపొందించిన చిత్రం ఇది. జూన్ 24న మా చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.
చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవి..
ఈ సినిమా హిట్ కాకపోతే ఇకపై మీ ముందు నిలబడను: రాజేంద్రప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment