Mahaan Vikram: Vikram Karthik Subbaraj Movie Name And First Look Released - Sakshi
Sakshi News home page

Chiyaan 60: ‘మహాన్‌’గా విక్రమ్‌.. లుక్‌ అదిరిందిగా

Published Fri, Aug 20 2021 9:28 PM | Last Updated on Sat, Aug 21 2021 8:51 AM

Mahaan : Title And First Look Out From Vikram And Karthik Subbaraj Film - Sakshi

విక్రమ్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మహాన్‌’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక లుక్‌ విషయానికొస్తే... మరోసారి సరికొత్త అవతారంలో కనిపించి సర్‌ప్రైజ్‌ చేశాడు విక్రమ్‌. పొడవాటి జుత్తు, గడ్డంతో చాలా స్టైలీష్‌గా కనిపించాడు. బుల్లెట్‌పై హుందాగా కూర్చొని నవ్వుతూ దర్శనం ఇచ్చాడు విక్రమ్‌.
(చదవండి: షాకింగ్‌.. 100 సెలబ్రిటీల నగ్న వీడియోలు లీక్‌!)

ఆయన వెనకాల కొమ్ములు, 16చేతులు గల ఒక ఆకారం కూర్చొని ఉంది. దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే సగ భాగం షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.   ఈ సినిమాలో విక్రమ్‌ సరసన సిమ్రన్‌ నటిస్తోంది. ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమరా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement