విజయ్‌ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులకు డబ్బుతో పాటు విందు | Mahanadu Land Farmers Meet Thalapathy Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులకు డబ్బుతో పాటు విందు

Published Sun, Nov 24 2024 1:26 PM | Last Updated on Sun, Nov 24 2024 3:52 PM

Mahanadu Land Farmers Meet Thalapathy Vijay

మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్‌ తాజాగా విందు ఇచ్చారు. మహానాడు జయప్రదం చేసిన వారికి బంగారు ఉంగరాలను అందజేశారు. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వీ సాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం మహానాడు గత నెల 27వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. తొలుత ఈ మహానాడు దక్షిణ తమిళనాడులో నిర్వహించేందుకు ప్రయత్నించినా అనుకున్నంత స్థలం ఏర్పాటు కాలేదు. 

చివరకు   చెన్నై – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీ సాలై వద్ద మహానాడు కోసం స్థలాన్ని ఇవ్వడానికి అనేక మంది రైతులు ముందుకు వచ్చారు. 207 ఎకరాల స్థలాన్ని మహానాడుకు కేటాయించింది. ఒక్కో ఎకరానికి రూ. 10 వేలు అద్దె చెల్లించినట్టు సమాచారం. ఇందులో  85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి అద్భుతంగా మహానాడు వేదిక ఏర్పాట్లు చేశారు. మహానాడు ఎవ్వరూ ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. తమిళగ వెట్రి కళగం మద్దతు దారులు విజయ్‌ కోసం పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. 

మహానాడుకు ముందుగా ఈ స్థలాలు ఏవిధంగా ఉన్నాయో అదే తరహాలో మళ్లీ తీర్చిదిద్ది మరీ రైతులకు విజయ్‌ అప్పగించారు. ఈ పరిస్థితుల్లో మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆయన చెన్నైకు పిలిపించారు. పనయూరులోని తమిళగ వెట్రి కళగం కార్యాలయంలో వీరందర్నీ విజయ్‌ కలిశారు. వారికి తానే స్వయంగా భోజనం వడ్డించి విందు  ఇచ్చారు. తాంబులంతో పాటు బట్టలు,పండ్లు , కానుకను అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement