అందం అంటే మహేశ్‌బాబు.. మహేశ్‌బాబు అంటే అందం.. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా సరే, ఇప్పటికీ ఎంతోమంది అమ్మాయిలకు మహేశ్ అంటే స్పెషల్. పిల్లలు సితార, గౌతమ్ తనంత ఎత్తు ఎదుగుతున్నా మహేశ్ మాత్రం రోజురోజుకీ వయసు తగ్గించేసుకుని వాళ్లకు అన్నలా కనిపిస్తున్నాడు. ఫిట్‌నెస్ కోసం కఠిన ఆహార నియమాలు పాటించే మహేశ్ సినిమాల కోసం అంతే కఠోరంగా శ్రమిస్తాడు.
సినిమాలతో బిజీగా ఉన్న అతడు తాజాగా ఓ కొత్త కారు కొన్నాడు. బ్రాండెడ్ రేంజ్ రోవర్ ఎస్వీ కారును కొనుగోలు చేశాడు. ఇంతకీ దీని ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా ఐదున్నర కోట్లు! రేంజ్ రోవర్ కారు అంటే చాలామంది హీరోలకు మోజు! అందులో మోహన్‌లాల్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తదితరులు ఉన్నారు. వీరందరు కూడా రేంజ్ రోవర్ కారు ఓనర్లే! ఇప్పుడు మహేశ్ ఇదే బ్రాండ్ కారు కొనుగోలు చేశాడు. ఇకపోతే ఈ కారు తెలుపు, నలుపు రంగులో ఉందనుకునేరు.. బంగారు పూత పూసినట్లుగా గోల్డ్ రంగులో మెరిసిపోతోంది. ఆ కారు రోడ్డు మీదకు వచ్చిందంటే అందరి కళ్లు దాని మీద పడటం ఖాయం!
సూపర్ స్టార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తొలుత పూజా హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో బుట్టబొమ్మ ఈ చిత్రం నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. గుంటూరు కారం జనవరి 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వత రాజమౌళితో యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment