సూపర్ స్టార్ మహేశ్ బాబు నిన్నటితో 47వ వసంతంలోకి అడుగు పెట్టాడు. మంగళవారం (ఆగస్ట్ 9) మహేశ్ బర్త్‌డే సందర్భందగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటితో పాటు జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, అడవి శేష్ ప్రముఖ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి పలువురు సినీ ప్రముఖులు మహేశ్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఇక మహేశ్ బర్త్‌డే అంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా మొత్తం ఫ్యాన్స్,సెలబ్రెటీల విషెస్‌తో నిండిపోయింది.
చదవండి: షూటింగ్‌లో కాలు విరగొట్టుకున్న హీరోయిన్..
దీంతో ట్విటర్‌లో మహేశ్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ 1స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఫ్యాన్స్, సన్నిహితులు, మిత్రులు చూపించిన ప్రేమకు మహేశ్ ఫిదా అయ్యాడు. బర్త్‌డే వేడుకలు ముగిసిన అనంతరం మహేశ్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రియమైన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా సూపర్ ఫ్యాన్స్ మీ విషెస్‌కు థాంక్యూ. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. గత ఏడాది చాలా బాగా గడిచింది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ తన బర్త్ డేకు విషెస్‌పై స్పందించాడు. కాగా నిన్న మహేశ్ బర్త్‌డే సందర్భంగా పోకిరి సినిమా స్పెషల్ షో వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఉత్సహం మరింత రెట్టింపు అయ్యింది. ఎక్కడ చూసిన మహేశ్ బర్త్‌డే హంగామే కనిపించింది.
❤️🙏 pic.twitter.com/iNiTlcRnZQ
— Mahesh Babu (@urstrulyMahesh) August 9, 2022
Comments
Please login to add a commentAdd a comment