Manchu Vishnu Share Special Post On His 14th Wedding Anniversary - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: నేను భయపడే ఏకైక వ్యక్తి నా భార్య.. పెళ్లి రోజు పోస్ట్‌ వైరల్‌

Published Wed, Mar 1 2023 11:51 AM | Last Updated on Wed, Mar 1 2023 12:37 PM

Manchu Vishnu Special Post on His Wedding Anniversary - Sakshi

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ మంచు విష్ణు, విరానికా రెడ్డి వ్యక్తిగతంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వివాహ బంధంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ, తెలుగు ఇండస్ట్రీలో చూడముచ్చటైన జంటగా నిలిచారు. నేడు (మార్చి 1) మంచు విష్ణు- విరానికల పెళ్లి రోజు. ఇద్దరి పెళ్లి జరిగి 14 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్‌ మీడియాలో భార్యతో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేసి.. మా నాన్న కంటే కూడా ఎక్కువగా భయపడేది విరానికకే! అయినా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేమ చిగురించింది ఇలా..
మంచు విష్ణు-విరానిక మొదట స్నేహితులుగా మారి తర్వాత ప్రేమికులయ్యారు. తల్లిదండ్రులను ఒప్పించి 2009లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. విరానికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కానీ లాక్ డౌన్ సమయంలో కర్చీఫ్ ని కుట్టులేకుండా మాస్క్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పి అందరినీ ఆకట్టుకుంది. విరానికా ఎక్కువగా ఫ్యామిలీతోనే సమయాన్ని గడిపేస్తుంటుంది.

రంగస్థలం నుంచి అన్ని రంగాల వరకు..
మంచు విష్ణు నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే బిజినెస్‌మెన్‌గానూ రాణిస్తున్నాడు. తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. 1985లోనే "రగిలే గుండెలు" బాల నటుడిగా అరంగేట్రం చేశాడు. 2007లో అతడు హీరోగా నటించిన "ఢీ" చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పాతిక సినిమాలకు పైగా విష్ణు హీరోగా నటించాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన విష్ణు.. కాలేజీ లెవెల్లో క్రికెట్, బాస్కెట్ బాల్‌లో పలు అవార్డులు కూడా అందుకున్నాడు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సీఈఓగానూ వ్యవహరిస్తున్నాడు.

వివేకవంతురాలు విరానిక రెడ్డి...
మంచు విష్ణు భార్య విరానిక రెడ్డికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. అన్నింటికీ మించి సేవాగుణానికి పెట్టింది పేరు. వైఎస్‌ రాజారెడ్డి కుటుంబంలో చిన్న మనవరాలు.. రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతుల కుమార్తె. బాల్యం నుంచి ఆమె అమెరికాలోనే ఉంది. చిన్నతనంలో విరానికకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టగా నాటి నుంచి నేటి వరకు సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ వుమెన్‌గా దూసుకుపోతున్నారు. విరానికాకు ఆఫ్రికాలోనూ వ్యాపారాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement