భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు | Manchu Vishnu Take a Break After Oath As MAA President With Wife Viranica Manchu | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Oct 27 2021 2:29 PM | Last Updated on Wed, Oct 27 2021 4:24 PM

Manchu Vishnu Take a Break After Oath As MAA President With Wife Viranica Manchu - Sakshi

ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలతో బిజీ బిజీగా ఉన్న నూతన ‘మా’ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు కాస్తా విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై గెలిచి అధ్యక్ష పిఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్త ప్రణాళికలతో వచ్చిన మంచు విష్ణు వీటికి కాస్తా బ్రేక్‌ ఇచ్చి ఫ్యామిలీతో టూర్‌కు ప్లాన్‌ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు సోషల్‌ మీడియా వేదిక వెల్లడించాడు. 

భార్యతో కలిసి విమానంలో వెళుతున్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య విరానిక గురించి ఆసక్తికర విషయం చెప్పాడు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వీడియో షేర్‌ చేస్తూ.. కాస్తా బ్రేక్‌ తీసుకుంటున్నా అని చెప్పాడు. అలాగే తన భార్య విరానికను చూపిస్తూ.. అవును తను హాట్‌..  ఎప్పుడూ  ఫోన్‌లో బిజీగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement