'తోబా తోబా' పాట.. హీరో విక్కీ కౌశల్‌పై ఆమె అసంతృప్తి | Sam Manekshaw's Daughter Disappointed With Vicky Kaushal Tauba Tauba Song, Deets Inside | Sakshi
Sakshi News home page

Vicky Kaushal: నాకు దొరికిన అతిపెద్ద ప్రశంస అది

Published Sat, Aug 17 2024 10:36 AM | Last Updated on Sat, Aug 17 2024 11:36 AM

Manekshaw Daughter Disappointment Vicky Kaushal Tauba Tauba

రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో 'తోబా తోబా' అనే ఓ హిందీ పాట తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మూవీలోని సాంగ్ ఇది. రీల్స్, షార్ట్స్‌లో ఊపేస్తున్న ఈ పాట దాదాపు అందరికీ నచ్చింది. కానీ ఓ మహిళ మాత్రం ఈ పాట మీరు చేసుండాల్సింది కాదని చెప్పారని విక్కీ కౌశల్ అన్నాడు. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా అనాల్సి వచ్చిందో కూడా వివరించాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన)

బాలీవుడ్‌లో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోల్లో విక్కీ కౌశల్ ఒకడు. గతేడాది చివర్లో 'సామ్ బహుదూర్' అనే సినిమా చేశాడు. గతంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించిన ఈయన.. దేశ చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. 'యానిమల్' మూవీతో పాటు రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. ఇందులో సామ్ మాణిక్ షా పాత్రలో విక్కీ కౌశల్ పరకాయ ప్రవేశం చేశాడు.

అయితే తాను చేసిన 'తోబా తోబా' పాట అందరికీ నచ్చింది గానీ సామ్ మాణిక్ షా కూతురు మాయకు మాత్రం నచ్చలేదని విక్కీ కౌశల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'ఓ రోజు మాయ (సామ్ మాణిక్ షా కూతురు).. ఎవరతడు? అని మెసేజ్ చేశారు. ఏమైందని అడ్గగా.. ఐదు నెలల క్రితం మీరు నాకు నాన్నలా అనిపించారు. మీరు ఈ టైంలో ఇలాంటివి చేసుండాల్సింది కాదు అని అన్నారు. అయితే నటన అనేది నా జాబ్ లాంటిది అని చెప్పి నవ్వేశా. కానీ ఆమెకు తన తండ్రిలా నేను కనిపించడం అనేది అతిపెద్ద ప్రశంస' అని విక్కీ కౌశల్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement