manekshaw
-
'తోబా తోబా' పాట.. హీరో విక్కీ కౌశల్‌పై ఆమె అసంతృప్తి
రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో 'తోబా తోబా' అనే ఓ హిందీ పాట తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మూవీలోని సాంగ్ ఇది. రీల్స్, షార్ట్స్‌లో ఊపేస్తున్న ఈ పాట దాదాపు అందరికీ నచ్చింది. కానీ ఓ మహిళ మాత్రం ఈ పాట మీరు చేసుండాల్సింది కాదని చెప్పారని విక్కీ కౌశల్ అన్నాడు. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా అనాల్సి వచ్చిందో కూడా వివరించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన)బాలీవుడ్లో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోల్లో విక్కీ కౌశల్ ఒకడు. గతేడాది చివర్లో 'సామ్ బహుదూర్' అనే సినిమా చేశాడు. గతంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించిన ఈయన.. దేశ చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. 'యానిమల్' మూవీతో పాటు రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. ఇందులో సామ్ మాణిక్ షా పాత్రలో విక్కీ కౌశల్ పరకాయ ప్రవేశం చేశాడు.అయితే తాను చేసిన 'తోబా తోబా' పాట అందరికీ నచ్చింది గానీ సామ్ మాణిక్ షా కూతురు మాయకు మాత్రం నచ్చలేదని విక్కీ కౌశల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'ఓ రోజు మాయ (సామ్ మాణిక్ షా కూతురు).. ఎవరతడు? అని మెసేజ్ చేశారు. ఏమైందని అడ్గగా.. ఐదు నెలల క్రితం మీరు నాకు నాన్నలా అనిపించారు. మీరు ఈ టైంలో ఇలాంటివి చేసుండాల్సింది కాదు అని అన్నారు. అయితే నటన అనేది నా జాబ్ లాంటిది అని చెప్పి నవ్వేశా. కానీ ఆమెకు తన తండ్రిలా నేను కనిపించడం అనేది అతిపెద్ద ప్రశంస' అని విక్కీ కౌశల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?) -
మహోజ్వల భారతి: ఐదు యుద్ధాల వీరుడు
సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో.. ఫీల్డ్ మార్షల్ మానెక్షా పూర్తి పేరు శాం హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా . 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు. షా తన కెరీర్లో మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను ‘శ్యామ్ బహదూర్’ అని పిలుచుకునేవారు. షా అమృత్‌సర్‌లోని పార్శీ దంపతులకు జన్మించారు. నలుగురు అన్నలు, ఇద్దరు అక్కలు. బ్రిటిష్ హయాం మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం మానెక్షా– రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం ‘మిలిటరీ క్రాస్’ను అమర వీరులకు ప్రకటించరాదన్నది నియమం. అందుకే మానెక్షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్ జనరల్ డి.టి.కోవన్, తన ‘మిలిటరీ క్రాస్ రిబ్బన్’ను తక్షణం మానెక్షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తూ మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్షా, మరోసారి బర్మాలో జపాన్ సైనికులను ఢీకొన్నారు. మళ్లీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. జపాన్ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధఖైదీలకు పునరావాసం కల్పించడంలో కూడా షా కీలకపాత్ర పోషించారు. 1947లో దేశవిభజన, 1947–48లో జమ్మూకశ్మీర్‌లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాట సామర్థ్యాలను మరోమారు లోకానికి చాటిచెప్పారు. 1937లో షా లాహోర్‌లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో సిల్లూ బోడె ను ఆయన కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది ఏప్రిల్ 22 న వారు వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, షెల్లీ బాట్లీవాలా, మాయా దారూవాలా. నేడు (జూన్ 27) మానెక్షా వర్ధంతి. 1914 ఏప్రిల్ 3న ఆయన జన్మించారు. (చదవండి: స్వతంత్ర భారతి: మూడు రాష్ట్రాల అవతరణ) -
ఫీల్డ్ మార్షల్ మానెక్ షా జయంతి: 10 ఆసక్తికర అంశాలు
సాక్షి: భారత ఆర్మీ మొదటి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జయంతి ఈరోజు(ఏప్రిల్ 3). భారత ఆర్మీ కమాండర్లలోని గొప్పవారిలో ఆయనకు ప్రథమ స్థానం దక్కుతుంది. ఈ రోజు ఆయన 104వ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు.. 1. శామ్ మానెక్ షా పూర్తి పేరు శామ్ హర్మోస్‌జీ ప్రేమ్‌జీ జంషెడ్జీ మానెక్ షా. జననం ఏప్రిల్ 3, 1914. మరణం జూన్ 27, 2008. మానెక్ షా తల్లిదండ్రులు పార్శీ మతానికి చెందినవారు. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. 2. భారత ఆర్మీలో చేరతానని మానెక్ షా మొదట తండ్రికి చెప్పడంతో ఆయన నిరాకరించారు. దాంతో లండన్ వెళ్లి గైనకాలజిస్ట్ అవుదామని మానెక్ షా అనుకున్నారు. కానీ అదీ నెరవేరలేదు. చివరికి మళ్లీ ఇండియన్ మిలటరీ అకాడమీ ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడవ్వడంతో ఆర్మీలో చేరారు. 3. మానెక్ షా 40 ఏళ్లు ఆర్మీలో సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం, ఇండియా-పాకిస్థాన్ యుద్ధం(1947), చైనా-ఇండియా యుద్ధం(1962), ఇండియా-పాకిస్తాన్ యుద్ధం(1966), బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం(1971)ఈ ఐదు యుద్ధాల్లో పాల్గొన్న ఏకైక ఫీల్డ్ మార్షల్. 4. ఇండియా-పాకిస్తాన్ 1971 యుద్ధానికి ముందు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని మానెక్ షాను అడిగింది. అప్పుడు ఆయన ‘ ఐ యామ్ ఆల్వేస్ రెడీ స్వీటీ’ అని అన్నారు. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పార్శీ మతస్తుడన్న సాన్నిహిత్యంతో ఆమెను స్వీటీ అని మానెక్ షా సంబోంధించేవారు. 5. మానెక్ షా పలుమార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బర్మాలో యువ కెప్టెన్‌గా జపాన్‌తో యుద్ధం చేయడానికి వెళ్లినపుడు తీవ్రంగా గాయపడ్డాడు. 9 బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్లాయి. సిపాయి శేర్ సింగ్ ఆయనను కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 6. ఒక మనిషి తాను భయపడటం లేదు అని చెబితే అతడు అబద్ధం చెబుతున్నాడు అని అయ్యిండాలి లేదా అతను గోర్ఖా అయినా కావాలి అని గొప్ప కొటేషన్ ఇచ్చాడు. 7. భారత దేశం విభజన జరిగిన సమయంలో మీరు పాకిస్తాన్ వెళ్లిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది ఓ వ్యక్తి అడిగినపుడు ఆయన సమాధానం ఏంటంటే...అన్ని యుద్ధాల్లో భారత్‌కు బదులు పాకిస్తాన్ గెలిచి ఉండేదని సరదాగా అన్నాడు. 8. ఆర్మీలో నుంచి రిటైర్ అవుదామన్న సమయంలో ఇష్టం లేకపోయినా 1972లో అప్పటి రాష్ట్రపతి ఆయన పదవీకాలాన్నీ 6 నెలలు పొడిగించడంతో మరో ఆరు నెలలు సేవలు అందించారు. 9. ఆయన అందించిన సేవలకు గానూ 1942 మిలిటరీ క్రాస్ అవార్డు, 1968లో పద్మ భూషణ్ అవార్డు, 1972లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 10. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రిలో న్యూమోనియాతో 2008, జూన్ 27న మానెక్ షా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు ఏ ఒక్క రాజకీయ నాయకుడూ హాజరుకాలేదు. కనీసం ఆయన చనిపోయిన రోజును జాతీయ సంతాప దినంగా కూడా ప్రకటించలేదు. -
యూపీఏకి సైనిక కుట్ర భయం!
డెబ్బయ్ దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్‌మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ‘భారత సైన్యమంటే పౌర ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించే బాధ్యతాయుతమైన దళం. ఎట్టి పరిస్థితులలోనూ తిరుగుబాటుకు ప్రయత్నించదు....’ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రెండురోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. రక్షణమంత్రి చేసిన ఈ ప్రకటన హఠాత్పరిణామం మాత్రం కాదు. యూపీఏ ప్రభుత్వం, సైనిక దళాల నాటి ప్రధానాధికారి వీకే సింగ్ వాస్తవాలను దాచి పెట్టారంటూ బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ చేస్తున్న విమర్శలతో ఇది అర్థమవుతుంది. కానీ రెండేళ్ల నాటి ఈ అత్యంత వివాదాస్పద ఘటనను ‘ముగిసిన అధ్యాయంగా’ అభివర్ణించి రక్షణమంత్రి ఇప్పుడు కూడా దేశ ప్రజల దృష్టిని మళ్లించాలని అనుకోవడమే వింత. అప్పుడు ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఈ కథనాన్ని రక్షణమంత్రి, నాటి సైనిక దళాల ప్రధానాధికారి కూడా తోసిపుచ్చినా, ఇప్పుడు అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూశాయి. దీనితో మొదట వచ్చే ప్రశ్న- పౌర ప్రభుత్వానికీ, సైన్యానికీ మధ్య అపనమ్మకం పెరుగుతున్నదా? స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో పౌర ప్రభుత్వం నిలకడగా కొనసాగడం భారతీయ సమాజం పరిణతికి నిదర్శనం. మన ఇరుగు పొరుగు దేశాలు ఇందుకు నోచుకోలేక పోవడం, దానితో ఎదురైన దుష్పరిణామాలు ప్రపంచానికి ఎరుకే. అయినా, మన దేశంలో కొన్నిసార్లు పౌర ప్రభుత్వాధినేతలు సైన్యాన్ని శంకించారని చెప్పడానికి దాఖలాలు లేకపోలేదు. ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలోనూ అలాంటిదేదో జరగబోతున్నదన్న అనుమానాలు కలిగాయి. నాటి రక్షణ మంత్రి కృష్ణమీనన్కూ, ఆర్మీ చీఫ్ కేఎస్ తిమ్మయ్యకూ మధ్య విభేదాలు ఇందుకు కారణం. పైగా భారత్‌లో సైనిక తిరుగుబాటుకు సీఐఏ తన వంతు ప్రయత్నం చేస్తున్నదని 1960 దశకంలో చైనా కూడా అనుమానించింది. తరువాత, 70 దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్‌మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయని అంతా భావిస్తున్నపుడు, ఇష్టంగానో అనిష్టంగానో ఇలాంటి ప్రత్యామ్నాయం గురించిన దృశ్యాలు సమాజం ముందు కదులుతాయి. 2012 జనవరి మధ్యలో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో రెండు సైనిక యూనిట్ల కదలికలు యూపీఏ ప్రభుత్వంలో ‘అత్యున్నత’ స్థాయిలోని వారిని కలవరానికి గురి చేశాయి. ఈ కదలికల గురించే ఆ సంవత్సరం ఏప్రిల్‌లో ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించగా రక్షణమంత్రి ఆంటోనీ, ‘ఇది శుద్ధ అబద్ధం’ అని కొట్టిపారేశారు. నాటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్, ఇది అనారోగ్యకర బుర్రల్లో నుంచి వచ్చిన వార్తాకథనమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటీవలే పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఏకే చౌధురి ఈ ఫిబ్రవరి 21న చేసిన ప్రకటన అసలు సంగతి బయట పెట్టింది. రెండేళ్లుగా ఆంటోనీ, వీకే సింగ్ అబద్ధం చెబుతున్న సంగతి వెల్లడయింది. చౌధురి చెప్పిన వివరాల ప్రకారం, జనవరి పదహారో తేదీన నాటి రక్షణ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ శర్మ తనను (చౌధురిని) పిలిచి ఆ దళాలను వెంటనే వెనక్కి వెళ్లమని ఆదేశించవలసిందిగా కోరారని ఆయన చెప్పారు. రాత్రి పదకొండుగంటల వేళ ఈ చర్చ జరిగింది. తాను ఇప్పుడే ప్రభుత్వ అత్యున్నత అధికార పీఠంపై ఉన్న వారి దగ్గర నుంచి వచ్చానని, వారు దళాల కదలికతో కలవరపడుతున్నారని శశికాంత్ తనకు చెప్పారని చౌధురి పేర్కొన్నారు. చౌధురి 2012లో సైనిక కార్యకలాపాల డెరైక్టర్ జనరల్‌గా (డీజీఎంఓ) పనిచేశారు. దళాల కదలిక, తన జనన సంవత్సర సర్టిఫికెట్ గురించి వీకే సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకే రోజు జరగడంతో ఈ అనుమానాలు కలిగాయని చౌధురి అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద రక్షణ కార్యదర్శి నివేదిక కోరడం, తాను ఇవ్వడం కూడా జరిగిందని చౌధురి వెల్లడించారు. చౌధురి ప్రకటన చేసిన మరునాడే వైమానిక దళాల రిటైర్డ్ చీఫ్ ఎన్ఏకే బ్రౌనే వెల్లడించిన అంశాలు కూడా 2012 నాటి ఘటన నిజమని స్పష్టం చేస్తున్నాయి. రెండు సైనిక యూనిట్లు కదలిక సమయంలోనే ఆగ్రా నుంచి పారా కమాండోస్ కూడా ఢిల్లీ దిశగా కదలిన సంగతిని బ్రౌనే వెల్లడించారు. నిజానికి పారా కమాండోలు 2012 ఫిబ్రవరిలో ఢిల్లీకి తర్ఫీదు కోసం వెళ్లవలసి ఉంది. ఈ దళం ఏ మిత్రదేశమైనా సంకటంలో పడినపుడు అత్యవసరంగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. సి-130 విమానాలతో ఈ కమాండోలకు ఇవ్వదలిచిన శిక్షణకు ఇంకా నెల సమయం ఉండగా ముందే ఎందుకు ఢిల్లీ వైపు కదిలాయన్నదే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. కాబట్టే, దేశ భద్రత, సాయుధ దళాల విశ్వసనీయత, ప్రభుత్వ మర్యాద వంటి అంశాలు ముడిపడి ఉన్న ఈ వివాదం గురించిన వాస్తవాలను తక్షణం వెల్లడించాలని రాజకీయ పక్షాలు కోరడం సబబే. - డాక్టర్ గోపరాజు నారాయణరావు