Meera Jasmine Re-Entry In Kollywood After 9 Years - Sakshi
Sakshi News home page

Meera Jasmine: 9 ఏళ్ల తర్వాత రీ ఎం‍ట్రీ ఇస్తున్న మీరాజాస్మిన్‌!

Published Thu, May 11 2023 7:10 AM | Last Updated on Thu, May 11 2023 9:43 AM

Meera Jasmine Re Entry In Kollywood After 9 Years - Sakshi

హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ను దక్షిణాది ప్రేక్షకులు అంత ఈజీగా మరచిపోలేరు. ఈ మలయాళీ భామ తమిళం, తెలుగు భాషల్లోనూ కథానాయికగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ఆమె రన్‌ చిత్రంతో పరిచయం అయ్యారు. మాదవన్‌ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా రాణించారు.

ఆ తరువాత నటనకు దూరం అయిన మీరా జాస్మిన్‌ ఇటీవల తన అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి రీఎంట్రీకి రెడీ అని సిగ్నల్‌ ఇచ్చారు. అదే విధంగా మలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా కోలీవుడ్‌లోనూ నటించడానికి సిద్ధం అయ్యారు. మీరాజాస్మిన్‌ కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం విజ్ఞాని. ఇది 2014 విడుదలైంది. కాగా సుమారు దశాబ్దం తరువాత మళ్లీ కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారన్న మాట. ఈమె తాజాగా నయనతారతో కలిసి నటించడానికి తయారవుతున్నారు.

వైనాట్‌ స్టూడియోస్‌ పతాకంపై శశికాంత్‌ మెగాఫోన్‌ పట్టి నిర్మిస్తున్న చిత్రం టెస్ట్‌. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో మాదవన్‌, సిద్ధార్థ్‌, నయనతార ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తాజాగా ఇందులో నటి మీరాజాస్మిన్‌ కూడా నటించబోతున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ సినిమా ద్వారా గాయని శక్తిశ్రీ సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతుండటం విశేషం. ఇటీవలే ప్రారంభం అయిన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్రాన్ని ఈ ఏడాది ప్రథమార్థంలో కానీ, చివరిలో గానీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

చదవండి: మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. రాహుల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement