Megastar Chiranjeevi Latest Movie Waltair Veerayya First Single Promo Out Now - Sakshi
Sakshi News home page

Waltair Veerayya: 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్‌ సింగిల్ ప్రోమో రిలీజ్

Published Tue, Nov 22 2022 2:46 PM | Last Updated on Tue, Nov 22 2022 3:41 PM

Megastar Latest Movie Waltair Veerayya First Single Promo Out Now - Sakshi

మెగాస్టార్​ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాస్​ పార్టీ సాంగ్ ప్రోమో​ విడుదలైంది. ఈ  ఏడాదిలోనే ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరు సందడి చేశారు. ఇందులో ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా.. గాడ్‌ఫాదర్ మాత్రం అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది.

(చదవండి: వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేల ఐటెం సాంగ్‌! క్లారిటీ వచ్చేసింది!)

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌ సింగిల్‌ సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. దర్శకుడు బాబీ సినిమాను రూపొందిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.  సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' థియేటర్లలో కనువిందు చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement