ప్రభాస్‌తో సినిమా.. దాని కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్ననాగ్‌ అశ్విన్‌ | Nag Ashwin on Casting Prabhas, Deepika Padukone and Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో సినిమా.. దాని కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్ననాగ్‌ అశ్విన్‌

Published Sun, Apr 25 2021 6:20 AM | Last Updated on Sun, Apr 25 2021 8:56 AM

Nag Ashwin on Casting Prabhas, Deepika Padukone and Amitabh Bachchan - Sakshi

వెండితెర సూపర్‌ హీరోలు అంటే ఇప్పటివరకు హాలీవుడ్, బాలీవుడ్‌ యాక్టర్ల పేర్లు ప్రముఖంగా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ లిస్ట్‌లో ప్రభాస్‌ పేరు కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ సూపర్‌ హీరో పాత్ర చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కోసం నాగ్‌ అశ్విన్‌ చాలా సమయం తీసుకుంటున్నారని టాక్‌. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన భారీ సెట్‌ వర్క్స్‌ కూడా జరుగుతున్నాయని టాక్‌.

ఈ ఏడాది జూలైలో షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు నాగ్‌ అశ్విన్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అయితే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర  చేయనున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement