
రష్యాలో థ్యాంక్యూ చెబుతున్నారు నాగచైతన్య. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ రష్యాలో జరుగుతోంది.
రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం వీధుల్లో మంచు కురుస్తోంది. ఆ వాతావరణంలో ఈ చిత్రానికి చెందిన పలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగచైతన్య, రాశీ ఖన్నా, ప్రకాశ్‌రాజ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై మైనస్ 18 డిగ్రీల చలిలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ‘థ్యాంక్యూ’ చిత్రానికి ‘దిల్’ రాజు నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment