టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామి రంగ. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా కనిపించనుంది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ఆషిక రంగనాథ్ పాత్రను అభిమానులకు పరిచయం చేశారు. స్పెషల్ గ్లింప్ల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో వరలక్ష్మి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఆషిక రంగనాథ్ లుక్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Introducing our Beautiful @AshikaRanganath as Varalakshmi ❤️
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2023
- https://t.co/YgXjdXhzmz#NSRForSankranthi #NaaSaamiRanga @mmkeeravaani @vijaybinni4u @SS_Screens @Dsivendra @boselyricist
Comments
Please login to add a commentAdd a comment