సోలో హీరోగా నాగార్జున కొత్త సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ నాగార్జున మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటూనే ఉన్నారట. కాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హర్ష కొనుగంటి ఇటీవల నాగార్జునకు ఓ స్టోరీ లైన్ వినిపించగా, నచ్చి ఈ సినిమా చేసేందుకు అంగీకరించారట నాగార్జున. దీంతో కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట హర్ష.
ఫైనల్‌గా కథ ఓకే అయితే ఈ సినిమాను సంక్రాంతి తర్వాత సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని నాగార్జున భావిస్తున్నారని భోగట్టా. మరి... నాగార్జున–హర్షల కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’, ధనుష్ హీరోగా చేస్తున్న ‘కుబేర’ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ నాగార్జున బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో ‘కుబేర’, మేలో ‘కూలీ’ విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment