![Nandamuri Balakrishna: Multiple Surprise Projects Will Announcement On His Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/4/balakrishna.gif.webp?itok=Htg87nxw)
జూన్ 10(గురువారం) నందమూరి బాలకృష్ణ బర్త్‌డే. బాలయ్య బర్త్‌డే అంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే నానారచ్చ చేసే ఆయన అభిమానులు కోవిడ్ మూలాన ఎలాంటి వేడుకలు జరుపుకోవడం లేదు. బర్త్‌డే రోజు మాత్రం చిన్నపాటి సెలబ్రేషన్స్‌తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదిలా వుంటే ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసేలా వచ్చే గురువారం బాలయ్య సినిమాలకు సంబంధించి వరుస అప్‌డేట్‌లు రానున్నాయట.
బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే కదా. దీనిపై హీరో బర్త్‌డే రోజు అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య ఓ సినిమా చేయనున్న విషయాన్ని కూడా అఫీషియల్‌గా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఫ్యాన్స్‌కు మరో కిక్కిచ్చే విషయమేంటంటే.. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న 'అఖండ' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో గతంలో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ చిత్రం మీద అఖండమైన అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment