
తొలి సినిమా 'ఉప్పెన'తో ఓవర్‌నైట్ క్రేజ్ సంపాదించుకుంది కృతీ శెట్టి. కుర్రకారుల గుండెల్లో ధక్‌ధక్‌ధక్ అంటూ మెరుపులు మెరిపించిన ఈ భామ ప్రస్తుతం టాప్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ కలిసి నటించే అవకాశాల్ని అందుకుంది. టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయిన కృతీశెట్టి అలియాస్ బేబమ్మను పోలిన ఓ నటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీటిని చూసిన కొందరు ఆమె బేబమ్మే అని భ్రమపడుతుంటే మరికొందరు మాత్రం కృతీ సిస్టర్ అయ్యుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆమె పేరు విద్య విను మోహన్. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం సన్ టీవీలో ప్రసారమయ్యే వల్లి సీరియల్‌తో బుల్లితెర మీద అడుగు పెట్టింది. మలయాళ, తమిళ సీరియల్స్ చేస్తూ ఆమె బిజీబిజీగా ఉంది.
గతంలో టిక్‌టాక్ ఉన్నప్పుడు హీరోహీరోయిన్లను పోలినవాళ్లు బోలెడు మంది ప్రపంచానికి పరిచయమయ్యారు. వారిలో చాలామంది సినిమాల్లో కూడా నటించారు. కానీ ఈసారి ఏకంగా కృతీని పోలిన నటి కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో బేబమ్మకు సిస్టర్‌లా ఉన్న విద్య విను మోహన్ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment