
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తారు. ఈ సినిమా కథను ఆల్రెడీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయట. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ ఉగాదికి జరుగుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాల్లో మొదలైందని, మే కల్లా ఈ భారీ సెట్ వర్క్ పూర్తయ్యేలా టీమ్ టార్గెట్‌గా పెట్టుకున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. జూన్ చివర్లో లేదా జూలై మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలా రాజమౌళి అండ్ కో సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు.