
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక..గతేడాది డిసెంబర్9న మిసెస్ నిహారికగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే వృత్తిపరంగానూ ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక..ఇటీవలె ఓ సినిమాకి కూడా సైన్ చేసిందని సమాచారం.
తాజాగా ఓ షోటోషూట్‌లో పాల్గొన్న నిహారిక దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఈ పోస్టును పూర్తిగా తెలుగులో టైప్ చేయడం విశేషం. నిహారిక చేసిన ఈ పోస్ట్‌కు భర్త చైతన్య స్పందిస్తూ..'గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే' అంటూ తన బావ రామ్‌చరణ్ పాటతో శ్రీమతిని పొడగ్తలతో ముంచెత్తాడు. మరోవైపు ఎలాంటి తప్పులు లేకుండా నిహారిక చేసిన ఈ తెలుగు పోస్ట్‌పై కల్యాణ్ దేవ్ సహా పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: మెగాస్టార్‌తో ఉన్న ఈ చిచ్చరపిడుగులను గుర్తుపట్టారా?
మాల్దీవుల్లో టాలీవుడ్ జంటల రచ్చ.. వైరలైన ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment