
హైదరాబాద్: ‘‘ఒట్టు.. నిన్నిలా నవ్వించే ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. అంటే ఇలా కొట్టే అవకాశాన్ని కూడా.. ఇక వెనక్కి చూసే అవసరం లేదు. హై చై’’ అంటూ నటి, మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై ప్రేమను చాటుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో తాజాగా షేర్ చేశారు. హజ్బండ్ అంటూ భర్తతో కలిసి ఉన్న ఫొటోలతో పాటు.. ‘‘నా కుటుంబాన్ని గర్వపడేలా చేశాను’’ అని ఉంగరం ఆటలో తాను గెలుపొందిన మధుర జ్ఞాపకాలు పంచుకున్నారు. ఈ క్రమంలో నిహారిక దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందమైన జంట అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: ‘బంగారు తల్లి.. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’)
కాగా నటుడు నాగబాబు కుమార్తె నిహారిక- జొన్నలగడ్డ వెంకట చైతన్య బుధవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. మెగా కుటుంబమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ క్రమంలో నిశ్చయ్ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(చదవండి: శ్రీవారిని దర్శించుకున్న నిహారిక దంపతులు)
Comments
Please login to add a commentAdd a comment