‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) సినిమాతో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాకు ప్యాకప్ చెప్పిన వెంటనే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే చిత్రంలో హీరోగా నటిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరోగా నటిస్తారట ఎన్టీఆర్. ఆల్రెడీ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మధ్య కథా చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రానుందని సమాచారం. మరి.. తన బర్త్ డే రోజున ఎన్టీఆర్ కొత్త సినిమా కబురు చెబుతారా? వేచి చూడాల్సిందే.
చదవండి:
అనిల్ రావిపూడికి కరోనా.. ఎఫ్-3 షూటింగ్ వాయిదా
అల్లుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా!
ఎన్టీఆర్ పుట్టిన రోజుకి కొత్త కబురు
Published Sun, Apr 18 2021 8:08 AM | Last Updated on Sun, Apr 18 2021 10:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment