జక్కన్న రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఎంతటి సంచలన విషయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూళ్లు చేస్తోంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ మూవీపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించిన సంగతి తెలిసిందే.
చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా
జెన్నీఫర్ అలియాస్ జెన్నీ అనే బ్రిటిష్ యువతిగా కీలక పాత్ర పోషించిన ఒలీవియా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో తాజాగా ఒలీవియా ఓ టీవీ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్బంగా ఆమె మూవీ విశేషాలతో పాటు ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫస్ట్‌డే తన బాయ్‌ఫ్రెండ్‌తో ఈ సినిమా చూశానని చెప్పిన ఒలీవియా ‘కోమురం భీముడో’ పాటలో తారక్ నటనకు ఫిదా అయినట్లు పేర్కొంది. ఈ పాటలో తారక్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చాయని, ఇందులోని మరిన్ని సన్నివేశాలు చూసి భావోద్వేగానికి లోనయ్యానని చెప్పింది. ఇక ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి అని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ తారక్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.
చదవండి: విజయ్ బీస్ట్ మూవీపై షారుక్ ట్వీట్, దళపతి ఫ్యాన్స్ రియాక్షన్ చూశారా?
ఇక ఈ మూవీలో నాటు నాటు పాట బాగా నచ్చిందని, ఈ పాటకు తన బాయ్‌ఫ్రెండ్ డ్యాన్స్ ట్రై చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే రాజమౌళి అద్భుతమైన డైరెక్టర్ అని కొనియాడింది. హైదరాబాద్‌లో తను 20 రోజుల ఉన్నానని, బిజీ షెడ్యుల్ కారణంగా నగరం మొత్తం చూడలేకపోయానని, కానీ హైదరాబాద్‌తో తనకు మంచి అనుబంధం ఎర్పడిందని, ఇక్కడ శిల్పారామం చూశానని చెప్పుకొచ్చింది. అక్కడ తన తల్లికి, సోదరికి సిల్క్ స్కార్ఫ్‌తో పాటు తన బాయ్‌ఫ్రెండ్‌కు బహుమతులు తీసుకున్నట్లు ఒలీవియా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment