
ప్రతిభావంతులైన సినీ కళాకారులను ప్రోత్సహించడంలో మూవీవుడ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎప్పుడూ ముందుంటోంది. వైవిధ్య భరిత చిత్రాలను, వెబ్ సిరీస్‌ను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా ఈ ఓటీటీ నిర్వాహకులు వైవిధ్య భరిత కథా చిత్రాలను, వెబ్‌సిరీస్‌లతో పాటు పలు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేయబోతున్నారు. ముఖ్యంగా శుక్రవారం నుంచి భరణికుమార్ దర్శకత్వంలో రూపొందిన కాలేజ్ డేస్, బాబు తుయవన్ దర్శకత్వంలో నటి అస్మిత ప్రధాన పాత్రలో నటించిన ఏ స్టోరీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ కామెడీ చిత్రం లాజిక్ మ్యాజిక్ బజక్ ప్రసారం కానుంది.
ఇందులో స్టోరీ వెబ్ సిరీస్ గురించి దర్శకుడు తెలుపుతూ పప్పీ అనే ఒక విధవ మహిళ ఇతివృత్తంతో రూపొందించిన వెబ్‌సిరీస్ అని తెలిపారు. విధవ అయినంత మాత్రాన ఆమె కూడా మనిషినే కదా. ఆమెకు ఆశ పాశాలు ఉండవా? అంటూ అడల్ట్ కథ కాకుండా పెద్దల కథాంశంతో 10 ఎపిసోడ్స్‌గా రూపొందిన ఏ స్టోరీ వెబ్ సిరీస్ ఆసక్తికరమైన అంశాలతో ఆలోచింపచేసే విధంగా ఉంటుందన్నారు. ఇక లాజిక్ మ్యాజిక్ బజక్ చిత్రం బ్లాక్ కామెడీ సన్నివేశాలతో జనరంజకంగా ఉంటుందని మూవీవుడ్ నిర్వాహకులు తెలిపారు. అదే విధంగా కాలేజ్ డేస్ వెబ్ సిరీస్ కళాశాల నేపథ్యంలో సందడి సందడిగా కలర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment