
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై తెరకెక్కిన వ్యంగ్యాత్మక చిత్రం పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ నేడు (జులై 25) ఆర్జీవీవరల్డ్‌థియేటర్.కామ్‌లో విడుదలైంది. సంచలన, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అయితే, తమ అభిమాన హీరో పరువుకు భంగం కలిగేలా ఆర్జీవీ సినిమా ఉందని పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. ఇదేక్రమంలో పవర్ స్టార్ సినిమాలో ఆర్టిస్టుగా ఆర్జీవీ తన ఫొటోను షేర్ చేయడంతో పవన్ అభిమానులు ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు.
‘పవర్‌స్టార్’ సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఆర్జీవీకి కౌంటర్‌గా పవన్ కల్యాణ్ అభిమానులు తీసుకొచ్చిన సెటైరికల్ మూవీ ‘పరాన్న జీవి’ కూడా డిజిటల్ ఫ్లాట్‌ఫాం శ్రేయాస్ ఈటీలో నేడే విడదలవడం విశేషం. పవర్ స్టార్ వర్సెస్ పరాన్నజీవి షోలతో పరిస్థితులు రసవత్తరంగా మారాయి. ఇదిలాఉండగా..రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు ఆర్జీవీ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్జీవే స్వయంగా మీడియాకు తెలిపారు.
(రూ. 250 పవర్‌స్టార్ సినిమా రిలీజ్ కంటే ముందే!)
Comments
Please login to add a commentAdd a comment