
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 1 ఎంతటి సంచనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే! సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ఊహించని స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. వారి నిరీక్షణలకు తెరదించుతూ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. పొన్నియన్ సెల్వన్ రెండో భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చిన్న టీజర్ వదిలింది.
కాగా పొన్నియన్ సెల్వన్ మొదటి భాగంలో విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీపన్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మద్రాస్ టాకీస్, లైకా సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు.
Let’s get those swords in the air as we await the 28th of April 2023!#CholasAreBack #PS1 #PS2 #PonniyinSelvan #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/gqit85Oi4j
— Lyca Productions (@LycaProductions) December 28, 2022
Comments
Please login to add a commentAdd a comment