సూర్యతో రొమాన్స్‌కు రెడీ? | Pooja Hegde Team Up With Suriya and Director Siruthai Siva Pan India Movie | Sakshi
Sakshi News home page

Pooja Hegde-Suriya: సూర్యతో రొమాన్స్‌కు రెడీ?

Published Wed, Jul 6 2022 11:57 AM | Last Updated on Wed, Jul 6 2022 12:03 PM

Pooja Hegde Team Up With Suriya and Director Siruthai Siva Pan India Movie - Sakshi

స్టార్‌ హీరోహీరోయిన్లు కలిసి నటిస్తే అభిమానులకు ఆ కిక్కే వేరు. తాజాగా నటుడు సూర్యతో రొమాన్స్‌ చేయించడానికి ఒక క్రేజీ హీరోయిన్‌తో చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వెట్టిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్రంలోనూ నటించనున్నారు. అయితే దీని కంటే ముందు చిరుతై శివ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకు జోడిగా ‘బుట్టబొమ్మ’ పూజాహెగ్డేను సంప్రదించినట్లు కోలీవుడ్‌లో టాక్‌. తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ఇప్పటి వరకు మంచి హిట్‌ పడలేదు. గతంలో మిష్కిన్‌ ముగముడి చిత్రం ద్వారా పూజాహెగ్డె  కోలీవుడ్‌కు పరిచయమైంది. 

అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఈ బ్యూటీని అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల బీస్ట్‌ చిత్రంలో విజయ్‌తో జత కట్టే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. కానీ అదీ కూడా నిరాశ పరిచింది. ఇక పూజకు ఇక్కడ కెరీర్‌ లేదనే ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా సూర్యతో నటించే అవకాశం తలుపు తట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సూర్యతో చిరుతై శివ పాన్‌ ఇండియా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అన్ని భాషల్లోనూ క్రేజ్‌ ఉన్న పూజాహెగ్డే హీరోయిన్‌ అయితే బాగుంటుందని  చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement