ChaySam Divorce: 'నీకు నేను, నాకు నువ్వు.. ఒకరికొకరం నువ్వు నేను..' అన్నట్లుగా ఉండేది చైసామ్ జంట. అన్యోన్యతకు, ప్రేమానురాగాలకు కేరాఫ్‌గా ఉండే ఆ జోడీని చూసి కుళ్లుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో! నిండు నూరేళ్లు కలిసి జీవిస్తారనుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటూ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అదిగో విడాకులు, ఇదిగో విడాకులు అంటూ వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ అవును విడిపోతున్నామని తేల్చి చెప్పేసింది. ఇకపై తాము కలిసి ఉండట్లేదని, ఎవరి దారి వారు చూసుకున్నామంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ జంట తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ ఖంగు తింది. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ చైసామ్ విడాకులపై స్పందించాడు.
'నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోవడం నిజంగా బాధాకరం. కానీ ఇది వారి వ్యక్తిగత విషయం. తమ నిర్ణయాన్ని గౌరవించండి అని అభ్యర్థించారు. నాక్కూడా గతంలో ఒకసారి విడాకులయ్యాయి. కాబట్టి ఆ బాధేంటో నాకు తెలుసు. చాలా ప్రేమించి ఒక్కటై, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం అనేది భరించలేని నొప్పి. అయినా వాళ్లు.. వేరేదారి లేక ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఇది వారి పర్సనల్ విషయం' అని చెప్పుకొచ్చాడు ప్రకాశ్‌రాజ్.
Comments
Please login to add a commentAdd a comment