
సాక్షి, హైదరాబాద్: నిర్మాత వల్లూరుపల్లి రమేష్ కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అవాస హోటల్‌లో జరిగింది. సాంబ శివరావు- శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజను మహర్షి పెళ్లాడారు. ఈ అందమైన జంటను ఆశీర్వదించడానికి పలువురు సినీ ప్రముఖులు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో శ్రీకాంత్, ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, సురేష్ కొండేటి తదితరులు ఈ వేడకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తూ కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగిందని వల్లూరుపల్లి రమేష్‌బాబు-గీత దంపతులు వెల్లడించారు. ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, కబడ్డీ కబడ్డీ, పందెం లాంటి విజయవంతమైన చిత్రాలను వల్లూరుపల్లి రమేష్ బాబు నిర్మించారు.
చదవండి: పెళ్లికి రెడీ అవుతోన్న 'పహిల్వాన్' విలన్





Comments
Please login to add a commentAdd a comment