'పుష్ప 2' అప్‌డేట్.. చెప్పినట్లు రెడీ | Pushpa 2 Movie Latest Update | Sakshi
Sakshi News home page

Pushpa 2: 'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ

Oct 8 2024 5:18 PM | Updated on Oct 8 2024 6:55 PM

Pushpa 2 Movie Latest Update

అల్లు అర్జున్ 'పుష్ప 2' నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. తొలి భాగం విషయంలో జరిగినట్లు కాకుండా ఈసారి పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం నిర్మాత రవిశంకర్ చెప్పినట్లు.. సగం మూవీని రెడీ చేశారు. సగ భాగానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్లు పోస్టర్ రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)

లెక్క ప్రకారం ఆగస్టు 15న 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అదికాస్త వాయిదా పడింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మేరకు తొలి హాఫ్ ఎడిటింగ్, రీ రికార్డింగ్ తదితర పనులన్ని పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

అంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేయడంతో పాటు నవంబరు కల్లా సెకండాఫ్‌ని రెడీ చేస్తారు. నవంబరు చివర్లో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరు 6న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొలి భాగాన్ని మించి ఉండబోతుందని వీటికి వచ్చిన స్పందన చూస్తే అర్థమవుతుంది. 

(ఇదీ చదవండి: కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement