'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజై మూడు వారాలవుతున్నా సరే జోరు చూపిస్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తున్నాయి. ప్లాన్ మారిందని, అనుకున్న టైం కంటే ముందే స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.
2021 డిసెంబరులో 'పుష్ప' సినిమా రిలీజైంది. థియేటర్లలో ఉండగానే.. నెలరోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు కూడా అలానే చేయబోతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఓటీటీ రిలీజ్ దగ్గర్లో ఉందంటేనే వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. గత నాలుగైదు రోజుల్లో పుష్ప 2 టైటిల్ సాంగ్, కిస్సిక్, ఫీలింగ్స్ వీడియోలని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ)
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. 'పుష్ప 2' డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. సంక్రాంతి ముందే అంటే జనవరి 9 లేదా 10వ తేదీల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగితే సరిపోతుందేమో?
ప్రస్తుతం రూ.1500 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసిన 'పుష్ప 2' సినిమాకు.. క్రిస్మస్, న్యూఇయర్ వీకెండ్ బాగా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం 'బాహుబలి 2' రికార్డ్ గల్లంతవడం గ్యారంటీ. చూడాలి మరి ఏం జరుగుద్దో?
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment