
Pushpa Movie Trailer Tease Out: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
చదవండి: రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే
సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో పుష్ప ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్రం బృందం తాజాగా దీనికి సంబంధించిన టీజ్‌ను వదిలారు. 26 సెకన్ల నిడివి గల ఈ టీజ్‌లో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్, యాక్షన్ సీన్స్ కనిపించగా మిగతా తారగణం అనసూయ, రష్మికతో పలు పాత్రలను చూపించారు. కాగా పూర్తి ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుండగా.. 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.
Get ready to witness the MASSive #PushpaTrailer on Dec 6th 💥💥
— Pushpa (@PushpaMovie) December 3, 2021
▶️ https://t.co/Wn0pVmlFTe#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic @MythriOfficial