బాలీవుడ్‌లో 'ప్యార్ కా పంచ్‌నామా' సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి సోనాలి సైగల్ బుధవారం(జూన్ 7) ముంబైలో వివాహం చేసుకుంది. తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ అయిన అషేష్ ఎల్ సజ్నానీని పెళ్లాడింది. అతను ముంబైలో ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. వారిద్దరూ చాలా కాలం పాటు రహస్యంగా డేటింగ్‌లో ఉన్నారని గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: రకుల్ అలా.. హెబ్బా ఇలా.. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తారలు!)
ఈ రూమర్స్‌కు తెర దించుతూ ఎట్టకేలకు వీరు పెళ్లిపీటలెక్కారు. పెళ్లి తర్వాత ఈ జంట కెమెరా ముందు ఫోటోలకు పోజులిచ్చారు. వధువు గులాబీ రంగు, వరుడు తెలుపు రంగు వస్త్రాలను ధరించారు. పెళ్లి వేడుకలో సోనాలి మరింత మెరిసిపోయింది. పెళ్లి జరిగే మండపానికి తన పెంపుడు కుక్కపిల్లను వెంటేసుకుని రావడం విశేషం. కుక్కపిల్లకు కూడా తనకు మ్యాచ్ అయ్యే డ్రెస్‌ను వేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జీవితంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించిన నటికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
(ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్)
Comments
Please login to add a commentAdd a comment