
( ఫైల్ ఫోటో )
సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం రావాల్సి ఉంది. కాగా రజనీ ఇటీవల భారత ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఆయన నటించిన ‘అన్నాత్తే’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ‘రా సామీ’ అంటూ సాగే పవర్‌ఫుల్ సాంగ్ (లిరికల్ వీడియో)ను చిత్ర బృందం ఈ రోజే విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment