Kollywood Movie News, Rajinikanth Wants To Act More Films - Sakshi
Sakshi News home page

ఇంకా నటించాలనుంది కానీ..

Published Thu, May 27 2021 8:17 AM | Last Updated on Thu, May 27 2021 12:35 PM

Rajinikanth Wants To Act More Films - Sakshi

ఇంకా నటించాలనుందనే ఆకాంక్షను నటుడు రజనీకాంత్‌ వ్యక్తం చేశారు. ఏడు పదుల వయసు పైబడుతున్న ఈయన ఇప్పటికీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రాన్ని ఆయన పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను చిత్ర యూనిట్‌తో పంచుకున్నారు.

అన్నాత్తే చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. అయితే ఇంకా మరికొన్ని చిత్రాలలో నటించాలనే ఆకాంక్ష ఉందని కానీ నా వయస్సు అందుకు సహకరిస్తుందా అనే విషయం.. ఆ భగవంతుడు ఇచ్చే శక్తిపై ఆధారపడి ఉంటుందని రజనీకాంత్‌ పేర్కొనట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా కరోనా ఉధృతి తగ్గిన తరువాత రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

చదవండి: వైరల్‌గా మారిన ఒరిజినల్‌ గ్యాంగస్టర్ల ఫొటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement