RC 15: Ram Charan And Shankar's Film Shooting Starts On October 21 - Sakshi
Sakshi News home page

Ram charan: ఈ నెలలోనే రామ్‌చరణ్‌ కొత్త చిత్రం షూటింగ్‌ షురూ?

Published Tue, Oct 12 2021 8:55 AM | Last Updated on Tue, Oct 12 2021 9:50 AM

Ram Charan and Shankar New Movie Shooting Starts on October 21 - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 21న పుణేలో షురూ కానుందనే టాక్‌ వినిపిస్తోంది.

ఆల్రెడీ పుణేలో సెట్‌ వర్క్‌ కూడా పూర్తి కావొచ్చింది. ఇందులో ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు రామ్‌చరణ్‌. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. 

చదవండి: చెర్రీ భారీ యాక్షన్‌.. ఒక్క ఫైట్‌ కోసం రూ.8 కోట్లు. పక్కా స్కెచ్చేసిన శంకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement