నేను గతంలో రాజమహేంద్రవరంలో రంగస్థలం షూటింగ్‌లో ఉండగా ఉప్పెన ఫంక్షన్‌కు వచ్చా..ఆ సినిమా రూ100కోట్లు సాధించింది.ఇప్పుడు ఓరి దేవుడా కోసం వచ్చా.. ఈ సినిమా కూడా ఉప్పెనలా పెద్ద విజయం సాధించాలి అని రామ్‌చరణ్ అన్నారు.విశ్వక్‌సేన్ హీరోగా వెంకటేష్ కీలక పాత్రలో నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్త్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్, ఆశాబట్ హీరోయిన్లు. పీవీపీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఈనెల 21 విడుదల కానుంది.
ఈ సందర్భంగా రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకులో ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఓరి దేవుడా ట్రైలర్ బాగా నచ్చింది. వెంకటేష్ అన్నా.. మీకోసమైనా నేను ఈ సినిమా చూస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వక్‌సేన్ పేరు తెలియని వారు ఉండరు. తప్పో, ఒప్పో.. తను ఇచ్చిన మాట కోసం నిలబడతాడు. అందుకే విశ్వక్ వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్. సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా ఎప్పుడూ సూపర్‌స్టార్‌గానే ఉండాలంటే వ్యక్తిత్వమే దోహదం చేస్తుంది. ఇందుకు రజనీకాంత్, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌గార్లు ఉదాహరణ అన్నారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రామ్‌చరణ్ అన్నయ్య సినీ ప్రయాణం నాకెంతో స్ఫూర్తి. మెగాస్టార్(చిరంజీవి) కొడుకుగా పెద్ద బాధ్యతతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వటం మామూలు విషయం కాదు.. ఇప్పుడాయన భారతీయ చలన చిత్రపరిశ్రమ అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. నేను క్రమశిక్షణగా ఉండను. కానీ, ఇప్పుడు అన్నయ్యను(రామ్‌చరణ్) దగ్గరగా చూశాను కాబట్టి ఆయన్నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటాను. హృదయాలను కదిలించే సినిమా ‘ఓరి దేవుడా’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుంది’’ అన్నారు అశ్వత్ మారిముత్తు. ఈ వేడుకలో చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీకాక, మ్యూజిక్ డైరెక్టర్ లియాన్‌జేమ్స్, కెమెరామేన్ విద్దు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment