గేమ్‌ ఛేంజర్‌: అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా అమెరికాలోనే! | Ram Charan Game Changer Movie Pre Release Event Venue Confirmed, Check For More Details Inside | Sakshi
Sakshi News home page

Game Changer Movie: ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. మాస్‌ ప్రమోషన్స్‌!

Published Fri, Nov 22 2024 8:45 PM | Last Updated on Sat, Nov 23 2024 12:01 PM

Ram Charan Game Changer Movie Pre Release Event Details

సినిమా తీయడం ఒకెత్తయితే ప్రమోషన్స్‌ చేయడం మరో ఎత్తు. సినిమాను జనాల్లోకి తీసుకునేందుకు చిత్రబృందం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నగరాల్లో టూర్స్‌ చేస్తుంటారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తారు.

ఇదెక్కడి మాస్‌రా మావా
అయితే రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఎవరూ ఊహించని ప్లేస్‌లో చేస్తున్నారు. అక్కడా, ఇక్కడా కాదు.. ఏకంగా అమెరికాలోనే ప్లేస్‌ ఫిక్స్‌ చేశారు. డిసెంబర్‌ 21న సాయంత్రం 6 గంటలకు ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ జరగనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

గేమ్‌ ఛేంజర్‌ పేరుకు సార్థకం
ఈ విషయం తెలిసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రమోషన్స్‌లోనే గేమ్‌ ఛేంజర్‌ అని నిరూపించుకున్నారు.. ఇదెక్కడి ప్రమోషన్స్‌రా.. భలే ప్లాన్‌ చేశారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇకపోతే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement