
చరణ్-ఉపాసనల కూతురు ఫోటో ఇదేనంటూ ఓ పసిపాప పిక్చర్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఇది నిజమేననుకున్న మెగా ఫ్యాన్స్ సదరు పాప ఫోటోను ఇతరులకు
మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి జన్మించింది. సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని సంతోషంలో మునిగి తేలుతోంది మెగా ఫ్యామిలీ. అటు ఫ్యాన్స్ కూడా వారసురాలొచ్చిందంటూ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే హంగామా మామూలుగా లేదు.
ఈ క్రమంలో చరణ్-ఉపాసనల కూతురు ఫోటో ఇదేనంటూ ఓ పసిపాప పిక్చర్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఇది నిజమేననుకున్న మెగా ఫ్యాన్స్ సదరు పాప ఫోటోను ఇతరులకు షేర్ చేస్తున్నారు. కానీ సదరు ఫోటో చరణ్ కూతురిది కాదు. చరణ్ దంపతులు ఇంతవరకు తమ పాపాయి ఫోటోను ఎక్కడా షేర్ చేయలేదు, మీడియాకు చూపించలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర రామ్‌చరణ్ యువశక్తి ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ చెర్రీ సైతం దృవీకరించాడు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటో మెగా ప్రిన్సెస్‌ది కాదు అని క్లారిటీ ఇచ్చాడు.
Pics circulating in social media are not the pics of #MegaPrincess
— SivaCherry (@sivacherry9) June 20, 2023
Check it out the Full Video Glimpse of Yesterday 's
— SivaCherry (@sivacherry9) June 21, 2023
Biggest Mega Festival of #MegaPrincess Kick starting 🤗✨
At Apollo hospitals ❤️🔥#RamCharanUpasanaBabyGirl
Hearty congratulations to our IDOL
𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan garu &
Mega Highness @upasanakonidela… pic.twitter.com/I85A9l4fbw
చదవండి: చిరంజీవి తాత అయినా మా అందరికీ మాత్రం హీరోనే: మంత్రి రోజా ట్వీట్